Tuesday, May 5, 2009

ముంబై డి.పి.ఎస్. గారి పత్తికొండ విజిట్.....

శ్రీ. ఎన్నం ఉపేందర్ , డి.పి.ఎస్., ముంబై రీజియన్ గారు 04.05.2009 న పత్తికొండ ప్రాజెక్ట్ యారో ఆఫీసు ను విజిట్ చేసారు. పత్తికొండ పోస్ట్ ఆఫీసు లో నిర్వహిస్తున్న అనేక సేవలను పరిశీలించారు. సాంకేతిక సేవల నిర్వహణ లో పత్తికొండ పోస్ట్ ఆఫీసు మిగతా అన్ని పోస్ట్ ఆఫీసుల కన్నా ముందు ఉన్నదని కొనియాడారు. పోస్ట్ ఆఫీసు ను చక్కగా నిర్వహిస్తున్నందుకు పోస్ట్ మాస్టరుకు మరియు మిగతా తపాలా సిబ్బందికి శుభాకాంక్షలను తెలియచేసారు.

చిరుమందహాసాలతో మేడే రక్తదాన శిబిరం.....




Sunday, May 3, 2009

"NEXT DAY DELIVERY" - ఆప్షన్ ను ఉపయోగించుట గురించి.....

ప్రాజెక్టు యారో పోస్తుమాస్టర్ల కు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు సెలవుదినములలో అనుసరించవలసిన విధానాన్ని ఇంతకు ముందే తెలియ చేసాము. అది పోస్టుమాన్ సాఫ్టు వేర్ లో ఉన్న " NEXT DAY DELIVERY" ఆప్షన్ ను ఉపయోగించుట గురించి. పి.ఎం.జి. గారు మరియు డి.పి.ఎస్. గారు 28.04.2009 న జరిగిన రివ్యూ మీటింగ్ లో దీనిని గురించి వివరించి యున్నారు. అయినా, మే డే రోజున మరల దాదాపు అన్ని ఆఫీసులలో డెలివరి పెర్ఫార్మన్స్ దెబ్బతిన్నది. దీనికికారణం, పైన తెలిపిన విధానాన్ని అనుసరించకపోవడమే. ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తిసుకోనగలరు.

డి.పి.ఎస్. గారి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

మే డే ........

అంతర్జాతీయ కార్మిక దినోత్స్వమును దృష్టిలో ఉంచుకొని స్థానిక పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయములో రక్త దాన సిబిరమును నిర్వహించారు. ఈ కార్యక్రమములో పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయ సిబ్బంది స్వచ్ఛదంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక కర్నూలు రీజియన్ డైరెక్టరు గారైన శ్రీ. వి. రాములుగారి ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసరు శ్రీ . వెంకటయ్య గారు మరియు అసిస్టెంట్ డైరెక్టరు - నార్త్, అసిస్టెంట్ డైరెక్టరు - సౌత్, అకౌంట్స్ ఆఫీసర్లు, మార్గనిర్దే సకత్వం వహించారు.